Nallamala: నల్లమలలో 27 కి.మీ. భూగర్భ సొరంగం.. 17 వేల ఎకరాల భూమి..!
నల్లమలలో భారీ భూగర్భ సొరంగం తవ్వేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా నల్లమల మీదుగా 24 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు 27 కి.మీ. పొడవున టన్నెల్ తవ్వనున్నారు. ఇందుకోసం 17 వేల ఎకరాల అటవీ భూమి వినియోగించనున్నారు.