Allagadda :పాపం.. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. శ్రీ కీర్తన స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారి హరిప్రియ స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా అదే బస్సు కింద పడి పాప చనిపోయింది.