BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!

సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పథకం డబ్బులు కూడా స్కూళ్లు తెరిచేలోగా అకౌంట్‌లోకి జమ చేస్తామని సీఎం వెల్లడించారు.

New Update
chandrababu

Chandrababu

సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు తెలిపారు.  తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల అకౌంట్‌లోకి రూ.15,000 జమ చేస్తామని సీఎం వెల్లడించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా  ఒకే విడతలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఫ్రీ బస్సు కూడా..

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీబస్ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ రోజు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఇది కూడా చూడండి:Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన క్యాబినేట్ మీటింగ్‌లో 2 వేల 260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకానికి తెలిపినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ఇది కూడా చూడండి:Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా లీగల్‌ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దుకాణాల ద్వారా రేషన్‌, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ జరిగింది.  

Advertisment
తాజా కథనాలు