Ap Crime News: చిటికెలో మోసం.. పెళ్లి కొడుకు బైక్‌పై వెళ్లి - ప్రియుడితో లేచిపోయిన పెళ్లికూతురు!

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.

New Update
bride ran away with her boyfriend day after her wedding

bride ran away with her boyfriend day after her wedding

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటన జరిగి 5 రోజులైనా పోలీసులు చేదించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

ప్రియుడితో పెళ్లికూతురు పరార్

కెనరా బ్యాంకు ఉద్యోగి మురళికి చెన్నే కొత్తపల్లి మండలం నాగసముద్రానికి చెందిన అర్చనకు ఈనెల 22న పెద్దలు కుదిర్చి పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజే అంటే 23వ తేదీ ఉదయం నాగసముద్రం నుంచి నూతన వధువరులు బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో వధువు అర్చన తన ఫ్రెండ్‌కు హెల్త్ బాగాలేదని.. చూసిరావాలని చెప్పడంతో వరుడు మురళి కొత్త బట్టలతోనే బైక్‌పై తీసుకెళ్లాడు. 

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

సరిగ్గా ధర్మవరంలో ఒకసెంటర్ వద్ద బైక్ ఆపమని చెప్పి మురళి దగ్గర ఉన్న మొబైల్‌ను తీసుకుంది. ఇపుడే వస్తానని మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో మురళి వెంటనే తన మొబైల్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆ మొబైల్ స్విచాఫ్ వచ్చింది. ఎంతసేపటికి రాకపోయేసరికి మురళి కంగారు పడి అర్చన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దీంతో వెంటనే అర్చన కుటుంబ సభ్యులు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అప్రమత్తమై ఫోన్ ట్రాక్ చేయగా ఒక ఇంట్లోకి వెళ్లి స్విచాఫ్ చేసుకుని తన ప్రియునితో పరరైనట్టు గుర్తించారు. అర్చన తనతో ఉన్న 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మురళీమొబైల్ ను కూడా తీసుకుని ప్రియునితో లేచిపోయినట్టు వచ్చిన పిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

అర్చన కుటుంబ సభ్యులు టీడీపీ మద్దతుదార్లు కాగా.. అర్చన ప్రియుడు బీజేపీ మద్దతుదారు కావడంతో ఇరుపార్టీల స్థానిక నేతలు తమదే జరగాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ధర్మవరం టౌన్ నడిబొడ్డున జరిగిన ఘటనపై ప్రియురాలు.. ప్రియుని ఆచూకీని పోలీసులు కనిపెట్టకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

crime news | latest-telugu-news | telugu-news | latest crime news ap | AP Crime

Advertisment
Advertisment
తాజా కథనాలు