/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/bhumana-1-jpg.webp)
Bhumana Karunakar Reddy
వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తిరుమల గోషాలలో వందకి పైగా ఆవుల మృతి చెందాయని భూమన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీరియస్‌గా తీసుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు అవాస్తవమని, భూమన అసత్య ప్రచారం చేస్తున్నాడని భాను ప్రకాష్ వెల్లడించాడు.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
మీ వాళ్లను వెయ్యి మందిని అయినా గోశాలకు రమ్మనండి… నేను మాత్రం ఒక్కడినే వస్తాను.
— Bhumana Karunakara Reddy (@bhumanatirupati) April 17, 2025
ఇలా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అయితే చేతకాని సవాళ్లు చేయడం ఎందుకు?
– భూమన కరుణాకర రెడ్డి pic.twitter.com/sOrXyzIAKG
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
హౌస్ అరెస్టు కూడా చేశారు..
ఇదిలా ఉండగా టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పర సవాళ్లు జరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి తెలపడంతో.. భూమన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తిరుమల గోశాలలో వందల ఆవులు మరణించాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ ఆరోపించారు.
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
ఇది అసత్య ప్రచారమని, ఆధారాలు బయటపెట్టాలని టీటీడీ సవాల్ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ తిరుమల గోశాల శాంతిర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ర్యాలీకి అనుమతి లేదని తిరుపతి పోలీసులు తెలిపారు. ర్యాలీగా వెళ్లవద్దని గన్‌మెన్‌లతో మాత్రమే సందర్శించాలని భూమనకు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
bhumana-karunakar-reddy | latest-telugu-news | telugu-news | breaking news in telugu | today-news-in-telugu | andhra-pradesh-news | andhra-pradesh-politics