/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
AP Govt
Ap Mega Dsc: వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీ అయ్యింది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతంచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలౌతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది.
jobs | mega-dsc | AP Mega DSC Latest Updates | chandrababu about mega dsc | chandrababu on mega dsc | cm chandrababu on mega dsc | cm chandrababu shocking decision on mega dsc notification | latest-news | latest-telugu-news | latest telugu news updates