Hyderabad Rain: గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్!

భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Hyderabad rains videos

Hyderabad rains videos

Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Rain Effect

అకస్మాత్తు వర్షంతో  బైకర్లు ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం పొందారు. రోడ్లు జలమయంగా మారాయి. 

 హైదరాబాద్‌లోని  బంజారాహిల్స్ రోడ్ నెం. 10 వీధిలో  భారీ వర్షం కారణంగా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. 

భారీ వర్షం తర్వాత రాజభవన్ రోడ్డులో వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

భారీ వర్షం, బలమైన గాలి కారణంగా రాజ్ భవన్ రోడ్డు వద్ద ఒక చెట్టు కూలిపోయింది. VV విగ్రహం నుంచి రాజ్ భవన్ రోడ్ల వైపు ప్రయాణించే ప్రయాణికులు అడ్డంకిని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు అభ్యర్థించారు. 

రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో బస్సులు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

సికింద్రాబాద్ లో కొద్దిసేపు కురిసిన వర్షంతో MG రోడ్ కండోజీ బజార్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయాయి. వర్షాల సమయంలో దేవుడు మనల్ని రక్షించాలి అంటూ స్థానికులు పోస్టులు పెడుతున్నారు. 

దిల్ సుఖ్ నగర్,-మలక్ పేట్ వైపు దారిలో.. అక్షయ హోటల్ వద్ద వరద నీరునిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది, 

telugu-news | latest-news | heavy-rains

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు