Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు

కన్య రాశివారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. వృశ్చిక రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇతర రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
New Year 2024 : కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సక్సెస్ ఫిక్స్..!!

 Horoscope Today: అంతా మంచే జరగాలని అందరం కోరుకుంటాం. దాని వల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుని కొత్త పనులకు శ్రీకారం చుట్టేవారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం

ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

వృషభం
వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి.అటువంటివి కలగకుండా జాగ్రత్త పడాలి. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.

Also Read: VIRAL VIDEO: కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

మిథునం
నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకువెళ్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది

కర్కాటకం

కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రతయ్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం.

Also Read: Manipur: మణిపూర్‌‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్‌ పై దాడి

సింహం

శ్రమ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. ధనచింత ఉండదు. శుభకార్య ప్రయ‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వ‌ల్ల లాభం చేకూరుతుంది. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాదలు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

నూతన కార్యాలకు ఆటంకాలు

కన్య

కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.

తుల

ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.

వృశ్చికం


నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు.

ధనుస్సు


పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

మకరం

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.

కుంభం

బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.

మీనం

ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

Also Read: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు

Also Read: Gold rates: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు