/rtv/media/media_files/2025/01/06/GgtRL0UZiAm7OL9XmVbi.jpg)
HMPV
Ap:దేశంలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై తీవ్ర ఆందోళనలకు వ్యక్తమవుతున్నాయి. చైనా, జపాన్ దేశాలలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇలాంటి తరుణంలో మన దేశంలోనూ HMPV వైరస్ కేసులు నమోదు కావటం ప్రజలను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.
Also Read: Rat Hole: 18 మందిని మింగిన 'ర్యాట్ హోల్'.. 300 అడుగుల లోతులో!
భారత్ లో ఇప్పటి వరకూ నాలుగు కొత్త వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఒకటి, పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో ఒక కేసు నమోదు అయ్యాయి. చెన్నైలోనూ రెండు కేసులు నమోదైనట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదైన క్రమంలో.. అప్రమత్తంగా ఉండాలని చెబుతుంది.
ఈ నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి గురించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవని.. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనిఅధికారులకు చెప్పారు. పొరుగున ఉన్న కర్ణాటకలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆస్పత్రులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే!
సేఫ్టీ ప్రోటోకాల్స్...
అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని.. చేతులు కలపకపోవడం, శుభ్రంగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ఉపయోగించడం, ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండటం లాంటి సాధారణ సేఫ్టీ ప్రోటోకాల్స్ ను పాటించడం మంచిదని మంత్రి అన్నారు. కర్ణాటకలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నిష్ణాతులైన వైద్యులతో ఒక అడ్వైసరీ గ్రూప్‌ను నియమించి దేశంలో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని.. ఐసీఎంఆర్, వీడీఆర్ఎల్ ల్యాబ్స్‌ను సన్నద్ధం చేసుకోవడం, అవసరం మేరకు టెస్టు కిట్లు, యాంటీ వైరల్ మందులను అందుబాటులో ఉంచడం, ఆసుపత్రులలో ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు లాంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించామని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
మరోవైపు హ్యూమన్ మెటానిమోవైరస్ అనేది కొత్తది కాదని.. గతంలో ఉన్న వైరస్సేనని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లలో 12శాతం వరకు ఇదే ఉంటోందని వైద్యులు, అధికారులు చెప్తున్నారు. ఈ వైరస్‌ను 2001లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా వివరించింది.
ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఇది కూడా కనపడుతుందని..ఐదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వాళ్లలో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
Also Read: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని!
Also Read: Telangana: కారులో ఇద్దరు సజీవ దహనం కేసులో కీలక ట్విస్ట్..