KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనంటూ కేటీఆర్ 'ఈడీ'కి విజ్ఞప్తి చేశాడు. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సమయం కావాలని కోరారు. దీంతో కేటీఆర్ రిక్వెస్టుకు ఈడీ అమోదం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామని ఈడీ స్పష్టం చేసింది. రేపు ఈడీ విచారణకు ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 08వ తేదీన బీఎల్‌ఎన్ రెడ్డి, 09వ తేదీన అరవింద్ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ సారైనా హాజరు అవుతారో లేదో చూడాలి. ఇది కూడా చదవండి: BIG Breaking : వదలని ఏసీబీ.. కేటీఆర్కు మళ్లీ నోటీసులు! ఏసీబీ విచారణకు డుమ్మా.. మరోవైపు కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని, ఈసారి కూడా లీగల్ టీమ్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ పై ఇటీవలే ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వచ్చేశారు. ఇది కూడా చదవండి: Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే!