/rtv/media/media_files/2025/04/16/e1qEbMzvOiIzf9TiHhp1.jpg)
Malayalam actress Vinci Soni Aloysius
Vinci Soni Aloysius: ఇటీవలే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమానికి హాజరైన గెస్టుగా హాజరైన మలయాళ నటి విన్సీ అలోసియస్ సంచలన ఆరోపణలు చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన ఒక నటుడితో కలిసి పనిచేసిన సమయంలో సినిమా సెట్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.
డ్రగ్స్ మత్తులో స్టార్ హీరో
నటుడు లేదా సినిమా పేరు ప్రస్తావించకుండా విన్సీ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సినిమా చేస్తున్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఒక స్టార్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతనితో కలిసి పనిచేయడం చాలా కష్టంగా ఉండేదని తెలిపింది. తన ముందే బట్టలు మార్చుకోమని బలవంతం పెట్టినట్లు చెప్పింది. అంతేకాకుండా డ్రెస్ సెట్ చేయడానికి సహాయం చేయాలా? అని అందరి ముందు అడిగేవాడని వాపోయింది. ఆ పరిస్థితి తనకు ఎంతో అసౌకర్యంగా ఉండేదని.. ఆ తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటీనటులతో తాను నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సదరు నటుడు తనతో అలా ప్రవర్తించడం అందరికీ తెలుసు.. కానీ, ఎవరూ స్పందించలేదని వాపోయింది. డ్రగ్స్ తీసుకోవడం వ్యక్తిగత విషయం కావచ్చు.. కానీ అది వృత్తిపరమైన వాతావరణాన్ని ప్రవితం చేయడం ఆమోదయోగ్యం కాదు అని తెలిపింది. విన్సీ ఆరోపణలు ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
In a video message on her Instagram account, Malayalam film actress Vincy Aloshious says that an artist misbehaved with her after using drugs on the sets of a movie.
— ANI (@ANI) April 16, 2025
In her video statement, she says, "A few days back, at an anti-drug campaign programme I made a statement that I… pic.twitter.com/sNlGwmM15F
నటి విన్సీ అలోసియస్ 2019లో 'వికృతి' చిత్రంతో అరంగేట్రం చేశారు. 'రేఖ' సినిమాలో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు వరించింది. 'జనగణమన', 'సౌదీ వెల్లక్క', 'పద్మిని', 'పజాంచన్ ప్రణయం' వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసింది. చివరిగా 'మారివిల్లే టవర్స్' సినిమాలో నటించింది విన్సీ.
latest-news | cinema-news | telugu-news | actress Vinci Soni Aloysius
Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?