ఏపీలోని నిరుద్యోగులు అత్యంత ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, విద్యావ్యవస్థలో యువ ఉపాధ్యాయుల నూతన శక్తిని నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామన్నారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి అని అన్నారు. ఉపాధ్యాయులు బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అనవసరమైన యాప్‌లను తొలగించామన్నారు. తద్వారా ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయించనున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు షాక్.. షర్మిల అంత మాట అనేసిందేంటి!
తల్లికి వందనం..
ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తోంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడూ విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యమన్నారు. ఇది మధ్యలోనే చదువు మానివేసే పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ స్పీచ్ లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రజారవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు పయ్యావుల కేశవ్. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!
ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్!