Alert: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

హైదరాబాద్‌ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 పైపుల మరమ్మతులు దృష్ట్యా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.

New Update
bandh

Alert: నగర వాసులు బి అలర్ట్‌ అంటున్నారు జలమండలి అధికారులు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కొన్ని మరమ్మతుల వల్ల నేడు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. 

Also Read: కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ!

గ్రేటర్‌ హైదరాబాద్‌ కు తాగునీరు అందించే మంజీరా ఫేజ్‌ 2 పైపుల్లో భారీ లీకేజీలను జలమండలి అధికారులు గుర్తించినట్లు సమాచారం. కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌ చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌సీ పైపుల్లో ఏర్పడిన లీకేజీల వల్ల ఈ ప్రాంతంలో నీటి వృథా భారీగా జరుగుతోందని జలమండలి అధికారులు గుర్తించారు. 

Also Read:  AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!

24 గంటల పాటు...

 ఈ లీకేజీల మరమ్మతులు చేసేందుకు జలమండలి అధికారులు ఈ నెల ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ 24 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు వస్తుందని చెప్పారు.

Also Read:  ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!

ప్రధానంగా  మియాపూర్‌, బీరంగూడ, లింగంపల్లి, చందానగర్‌, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌పీ,  గంగారం, అమీన్‌పూర్‌, ఎర్రగడ్డ,  ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, మదీనాగూడ,మూసాపేట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. 

Also Read: కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర

మరమ్మతులు పూర్తయ్యే వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఈ సమస్యను అర్థం చేసుకుని సహకరించాలని అధికారులు సూచించారు. ఈ లీకేజీలను తొందరగా పరిష్కరించేందుకు జలమండలి కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యాక  ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు