YS Sharmila: జగన్‌కు షాక్.. షర్మిళ అంత మాట అనేసిందేంటి!

మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వైఎస్ షర్మిళ షాకింగ్ ట్వీట్ చేసింది. అసెంబ్లీ మీద అలగడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ఫైర్ అయ్యారు.

New Update
ys sharmila

అసెంబ్లీ మీద అలగడానికి ప్రజలు ఓట్లు వెయ్యలేదు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిళ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిళ.. ప్రతిపక్షంలో ఉన్న జగన్, అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్‌ తీరుపై ఫైర్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్!

అలా ఉంది జగన్ మోహన్ రెడ్డి తీరు

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అని షర్మిళ అన్నారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది?.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది? అని ఫైర్ అయ్యారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే.. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని.. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!

సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు

అదే సమయంలో కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అన్నారు. మహిళలపై దాడులు ఆగడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా రాజ్యమేలుతోందని అన్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేట

అలాగే బెల్టు షాపుల దందాను అరికట్టలేదని ఆరోపించారు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని విమర్శించారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే.. ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం అని అన్నారు. 

టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు

1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా కుంగిపోలేదని.. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని అన్నారు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం అని గుర్తు చేశారు. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ!

పిచ్చితనం పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి

హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని గుర్తు చేశారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని కొనియాడారు.  ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండని.. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండని అన్నారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండని.. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండని మండిపడ్డారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు