Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు!
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.10లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు తాజాగా బడ్జెట్లో ఈ పథకంకోసం రూ.1,250 కోట్లు కేటాయించింది. దీంతో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనుంది.