Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!

లెబనాన్ హెజ్‌బొల్లా మాజీ అధినేత హసన్‌ నస్రల్లా అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు పోటెత్తారు. గతేడాది సెప్టెంబర్‌ లో ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో ఆయన మృతి చెందగా..ఐదు నెలల తరువాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.

New Update
nasrallah

nasrallah

లెబనాన్ హెజ్‌బొల్లా మాజీ అధినేత హసన్‌ నస్రల్లా అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు పోటెత్తారు. గతేడాది సెప్టెంబర్‌ లో ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో ఆయన మృతి చెందినవిషయం తెలిసిందే.. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలకు లెబనాన్‌ రాజధాని బీరూట్‌ లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు  చేశారు. నస్రల్లా బంధువు, హెజ్‌బొల్లా వారసుడిగా భావించిన హషీమ్‌ సఫీద్దీన్‌ కూ తుది వీడ్కోలు పలకనున్నారు.

Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్‌ గా మారిన సహాయక చర్యలు!

ఇరువురికి నివాళులు ఆర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్‌ లోని స్టేడియం కిక్కరిసిపోయింది. మరోవైపు బీరూట్‌ గగనతలంలో ఇజ్రాయెల్‌ యుద్ద విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ లో బీరూట్‌ దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయం పై ఇజ్రాయెల్‌ యుద్ద విమానాలు విరుచుకుపడ్డాయి.ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్‌ జనరల్‌ అబ్బాస్‌ నీలోఫరసన్‌ తదితరులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Illegal Indian Immigrants: ఇండియాకు చేరుకున్న 12 మంది అమెరికా అక్రమవలసదారులు

రహస్య ప్రదేశాల్లో...

కొన్ని రోజులకు మరోదాడిలో సఫీద్దిన్‌ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరినీ తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు.వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్‌బొల్లా ప్రకటించింది.ఈ క్రమంలోనే బీరూట్‌ లో నస్రల్లాను ,సఫీద్దీన్‌ ను దక్షిణ లెబనాన్‌ లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాటు చేసింది.

ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్‌ లోని స్టేడియానికి తరలించింది. ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు విచ్చేసినట్లు హెజ్‌బొల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్‌ నుంచి పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఘెర్‌ ఖాలిబఫ్‌, విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చ హాజరయ్యారు. 

అంత్యక్రియల సమయంలో బీరూట్‌ గగనతలం పై తమ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతుండటం పైఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ దేశం జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటుతున్నట్లు తెలిపారు.అంతకుముందు దక్షిణ, తూర్పు లెబనాన్ లోని ఆయుధ నిల్వల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.  

Also Read: IND vs PAK: ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!

Also Read: Giorgia Meloni: మాపై లిబరల్స్‌ బురద జల్లుతున్నారు.. జార్జియా మెలోనీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు