/rtv/media/media_files/2025/02/24/pqywWr8pZCw8v1d3Kc4L.jpg)
Travel bus burned in Mahabubnagar district
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది. బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
ఏపీలో బస్సు బోల్తా
తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. పుదుచ్చేరి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
మరో విషాదం
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ఆకుల మల్లయ్య కూతురు మనీషా(24), పులిగుజ్జ సంపత్ ఇద్దరూ పారామెడికల్ కోర్సు చేసే రోజుల్లో ప్రేమించుకున్నారు. సంపత్‌ది కూడా సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం. దీంతో ఇద్దరూ ఒకే జిల్లాకి చెందిన వారు కాబట్టి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున ఉప్పల్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
మ్యారేజ్ అనంతరం రామంతాపూర్‌లో ఉంటూ సంపత్ ఓ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా సంపత్, అతడి సమీప బంధువు భాషబోయిన మున్నిత ఆ యువతిని వేధించడం మొదలు పెట్టారు. కట్నం తేవాలంటూ చిత్ర హింసలు పెట్టారు. ఇక వీరి వేధింపులు తాళలేక ఆ యువతి మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Also Read: champions trophy: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు