Virus: అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ తింటే ఇక ప్రమాదమే

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

New Update
chicken

west godavari

Virus to Poultry: చికెన్(Chikhen) అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముక్క లేనిదే కొందరికి ముద్ద కూడా దిగదు. ఇలాంటి వాళ్లకి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కోళ్లు అంతు చిక్కని వైరస్ బారిన పడుతున్నాయి. ఈ వైరస్ ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లా కోళ్లను ప్రభావితం చేస్తోంది. గంట ముందు ఆరోగ్యంగా కనిపించే కోడి చనిపోతుంది.

ఇది కూడా చూడండి: OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

అంతుచిక్కని వైరస్ సోకడంతో..

ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అందులోనూ పందేలు కోసం పెంచిన కోళ్లు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నాయి. దీంతో చికెన్ తినే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చికెన్ తినడం వల్ల మనుషులు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

ఇదిలా ఉండగా ఈ అంతు చిక్కని వైరస్ ఇప్పుడే కాదు.. నాలుగేళ్ల క్రితం కూడా వచ్చిందట. అప్పట్లో కూడా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఏళ్ల తర్వాత వైరస్ తగ్గింది. ఇంతలో చాలా నష్టాలు చవి చూశారట. మరోసారి ఇప్పుడు ఈ వైరస్‌ రావడంతో పౌల్ట్రీ యజమానులతో పాటు చికెన్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు