Bangladesh Court: షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారెంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

New Update
sheikh Hasina

sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు రాజధాని ఢాకా శివార్లలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో కోర్టు అరెస్టు వారెంట్లు జారీచేసింది. మరో 16 మందికి ఢాకా మెట్రోపాలిటన్‌ సీనియర్‌ ప్రత్యేక జడ్జి అరెస్టు వారెంట్లు జారీచేశారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ఏప్రిల్ 29లోగా తెలియజేయాలని..

ఈ నిందితులు అందరూ కూడా పరారీలో ఉన్నారు. దీనిపై ఏప్రిల్‌ 29కల్లా తెలియజేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఢాకా శివార్లలో దౌత్యవేత్తల కోసం ఉద్దేశించిన పూర్వాచల్‌ న్యూటౌన్‌లో 1.86 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను హసీనా, ఆమె బంధువులు చేజిక్కించుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ ఆరోపిస్తూ గత డిసెంబరులో బంగ్లా అవినీతి నిరోధ కమిషన్‌ దర్యాప్తు మొదలుపెట్టింది.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

sheikh-hasina | latest-telugu-news | international news in telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు