/rtv/media/media_files/2025/11/07/auto-driver-2025-11-07-07-22-13.jpg)
auto driver
ప్రస్తుతం బంగారం(gold) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజురోజుకి బంగారం విలువ భారీగా పెరుగుతోంది. తులం బంగారం కొనాలనుకున్నా కూడా లక్షలు పెట్టాల్సిందే. అయితే నేటి రోజుల్లో ఎవరికైనా చిన్న ముక్క బంగారం దొరికితే మాత్రం దాచుకుంటారు. ఆ బంగారం ఎవరిదో వారికి కనీసం ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు బంగారానికి ఉన్న విలువ అలాంటిది. ఇలాంటి రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం వెళ్లారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో ఆటో ఎక్కారు.
ఇది కూడా చూడండి: వైసీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం!
12 తులాలు తిరిగిచ్చిన..
తాము వెళ్లవలసిన చోటుకు చేరుకున్నాక ఆటో దిగే సమయంలో బంగారం ఉన్న సూట్‌కేసును మరిచిపోయారు. ఆ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ వారు దిగిన కొంత సమయానికి గమనించారు. దానిని తెరిచి చూడగా అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే అతను ఆ సూట్ కేసును తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారు కనిపించలేదు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ నిజాయితీగా బంగారం ఆభరణాల బ్యాగ్‌ను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. వారు వెంటనే బంగారం ఎవరిది అనే విషయాన్ని గుర్తించి 12 తులాల బంగారం అందించారు. పోయిందని అనుకున్న బంగారం తిరిగి దక్కడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషపడి ఆ ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చి సత్కరించారు.
ఇది కూడా చూడండి: ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!
Follow Us