/rtv/media/media_files/2025/11/06/car-2025-11-06-13-57-42.jpg)
వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్‌రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీఫుటేజీలో పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. కారును తగలబెట్టి అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. గతంలోనూ పలుమార్లు గౌతమ్‌రెడ్డిపై దాడికి యత్నించారు దుండగులు.
BIG SENSATION
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 6, 2025
వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి కారుకి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి
ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి.. నిప్పంటించి పరార్
సీసీటీవీ ఫుటేజీలో ఘటన దృశ్యాలు రికార్డ్.. పోలీసులకు వైసీపీ నేత ఫిర్యాదు
తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని… pic.twitter.com/GcDUlvRi8T
గౌతమ్‌రెడ్డి ఆవేదన
తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవట్లేదని గౌతమ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని గౌతమ్‌రెడ్డి పోలిసులను కోరారు. తన కారుకు మంటలు అంటుకున్న ఘటనపై గౌతమ్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు స్పష్టంగా కనిపించడం లేదు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అసలు ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఎవరి పని? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జగన్ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేశారు గౌతమ్‌రెడ్డి.
Follow Us