AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..!
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్లో బాలయ్య ఇంత క్లాస్లీ పవర్ఫుల్గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.
అనంతపురం తాడిపత్రి మండలంలో విషాదం జరిగింది. వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గీత(24)కు ఆదివారం నిశ్చితార్థం కుదిరింది. గోరింటాకు పెట్టించుకుందామని శనివారం తమ్ముడితో కలిసి బైక్పై పక్కూరి వెళ్లింది. తిరిగొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందింది.
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న ప్రేమ్సాయిని కొందరు విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో.. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. కక్ష కట్టుకొని విద్యార్థులు ప్రేమ్ను తీవ్రంగా కొట్టి చంపారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుందన్నారు.
AP: హిందూపురంలో జగన్కు బాలకృష్ణ షాక్ ఇచ్చారు. చైర్ పర్సన్ ఇంద్రజతో సహా 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైసీపీ సంఖ్యాబలం తగ్గడంతో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఖాతాలో పడింది.
AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ భూములు అక్రమించారంటూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు రెడీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు అందించేందుకు నిధులు మంజూరు చేశారు.
కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.