Paritala Ravi: 18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్

పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

New Update
ravi

టీడీపీ నేత , మాజీ మంత్రి పరిటాల రవి హత్యకేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి బెయిల్ వచ్చింది. పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పరిటాల రవి హత్య కేసులో ఏ3గా ఉన్న పండుగ నారాయణరెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 బజన రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!

ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే నిందితులు ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఉత్తర్వుల్లో వివరించింది. సోమవారం ఉదయం 11 గంటలకల్లా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఎదుట హాజరు అవ్వాలని చెప్పింది. చట్టానికి లోబడి వ్యవహరించాలని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఏపీ హైకోర్టు హెచ్చరించింది.

Also Read: KTR: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!

AP High Court - Paritala Ravi

2005లో జరిగిన పరిటాల రవి హత్య అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ ఐదుగురికి కింది కోర్టు శిక్ష విధించింది. వీరంతా కూడా గత 18 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారు. అయితే కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. అలాగే బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. 

Also Read: Jaipur: పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్ని ప్రమాదం..ఐదుగురి మృతి!

ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను అనే రౌడీ షూటర్ అరెస్ట్ అయ్యాడు. తన బావ సూరి కళ్లలో ఆనందం చూడటం కోసమే పరిటాల రవిని కాల్చానంటూ అప్పట్లో మొద్దు శీను మీడియా ముఖంగా ప్రకటించి సంచలనాలకు తెరలేపాడు.

Also Read: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు

పరిటాల హత్యక కేసులో అరెస్టైన మొద్దు శీను అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డిని 2008లో మల్లెల ఓం ప్రకాశ్ అనే ఖైదీ జైల్లో హత్య చేశారు. మొద్దు శీను నిద్రపోతున్న సమయంలో తలపై డంబెల్‌తో మోది హత్య చేశాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ కూడా 2020లో అనారోగ్యంతో మరణించాడు.

 ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి సైతం హత్యకు గురయ్యారు. భానుకిరణ్ అనే వ్యక్తి సూరిని వెనుక నుంచి కాల్చి చంపాడు. అనంతరం భానుకిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాంతో అతనికి శిక్ష పడింది.

నెలరోజుల క్రిందట మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ కూడా జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు