Mohan Babu : నటుడు మోహన్ బాబుకు (Mohan Babu) సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. జర్నలిస్టు పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గత నెల 23న బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు మోహన్ బాబుకు.. నాలుగు వారాల వరకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో ముందస్తు బెయిల్ జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. ధర్మాసనం. Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com మోహన్ బాబుకు ధర్మాసనం ప్రశ్నలు విచారణలో భాగంగా ధర్మాసనం మోహన్ బాబును.. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా? నష్టపరిహారం చెల్లిస్తారా? లేదా జైలుకు పంపాలా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి మోహన్ బాబు తరుపున న్యాయవాది కౌన్సిల్ ముకుల్ రోహిత్గి తన వైపు వాదనలను వినిపించారు. ఆయన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. జర్నలిస్టు పై దాడికి మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 76 ఏళ్ళ వయసున్న ఆయన కావాలని చేయలేదు.. ఆవేశంలో జరిగింది. నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తరుపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. Also Read : మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ? మరో వైపు జర్నలిస్టు తరపు వాదనలు కూడా వినిపించారు. జర్నలిస్ట్ 5 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారని. నెలరోజులుగా పైపు ద్వారానే ఆహరం తీసుకుంటున్నాడని.. తన పై దాడి చేయడమే కాకుండా కించపరిచారని. వృత్తి పరంగా తన కెరీర్ నష్టపోయిందని వాదించారు. ఇలా ఇరు వైపు వాదనలు విన్న న్యాయస్థానం కేసు నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. తీర్పను తదుపరి విచారణలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా