YCP Counter on Lawyer Sidharth Luthra Tweet: ఒక సుప్రీంకోర్టు న్యాయవాది మాట్లాడవలసిన మాటలు కాదు ఇవి అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు తరుఫు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా చేసిన ట్వీట్ మీద మండిపడుతున్నారు. అన్ని ప్రయత్నాలు చేసినా కనుచూపు మేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం అంటూ గురు గోవింద్ కోట్ ను చంద్రబాబు తరుఫు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదొక పెద్ద సంచలన విషయమైంది. లాయర్ చేసిన ట్వీట్ హింసను రెచ్చగొట్టేలా ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బాబు అరెస్ట్, బెయిల్ మంజూరు కాకపోవడం లాంటి విషయాలు జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఱ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇవి కచ్చితంగా కవ్వింపు చర్యల కిందకే వస్తుందని ఆరోపిస్తున్నారు. పరోక్షంగా అల్లర్లు చేయండి అని సందేశం ఇస్తున్నట్టు అనిపిస్తోందని మండిపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు లాయర్ ట్వీట్ మీద పరోక్షంగా స్పందించారు. న్యాయపోరాటం కంటే ఆయుధ పోరాటమే మిన్న అన్న న్యాయవాది మాటలతో ఈ కేసు బలం అర్థమైందని ఆయన ట్వీట్ చేశారు.
చంద్రబాబు కేసు పరిణామాలు, రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఒక ప్రఖ్యాత లాయర్ ఇలా ట్వీట్ చేయడం సరికాదని కొందరు న్యాయవాదులు కూడా విమర్శిస్తున్నారు. నిన్న సిద్ధార్ధ్ లూథ్రా చంద్రబాబును కలిసి 40నిమిషాల ఆపటూ మంతనాలు జరిపారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.