దేశవ్యాప్తంగా అతి భారీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురుగాలులు ఉంటాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జీడిమెట్ల, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అస్సాంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 31వేల మంది నిరాశ్రులయ్యారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.