దేశవ్యాప్తంగా అతి భారీ వర్షాలు రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. By Vijaya Nimma 28 Jun 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, యూకే, హిమాచల్ ప్రదేశ్, సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, యూకేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వచ్చే నెల 5వ తేదీ వరకూ యూపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. డెహ్రాడూన్ తోపాటు యూపీలోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని రోజులపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అమర్‌నాథ్ యాత్ర మార్గంలో, సున్నితమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.మురుగేషణ్ తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హెచ్చరికలు జారీ మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఆ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.గోవా పనాజీ, మహారాష్ట్రకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, థానే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి