అస్సాంను ముంచెత్తిన వరదలు, నిరాశ్రులైన 31వేల మంది, రెడ్ అలర్ట్ జారీ..!!

అస్సాంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 31వేల మంది నిరాశ్రులయ్యారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

New Update
అస్సాంను ముంచెత్తిన వరదలు, నిరాశ్రులైన 31వేల మంది, రెడ్ అలర్ట్ జారీ..!!

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన వాన...నిరంతరాయంగా కరురుస్తూనే ఉంది. దీంతో పలు పట్టణాలు, గ్రామాలు, పొలాలు నీటమునిగాయి. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు అస్సాంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రాజధాని గుహవాటిలో రానున్న 24గంటల్లో భారీవర్షాలు నమోదు అవుతాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

assam floods

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూగర్, కోక్రాజార్, లఖింపూర్, నల్బరీ, సోనిత్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో వరదల కారణంగా 30,700 మందికిపైగా ప్రజలు నిరాశులయ్యారు. లఖింపూర్ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. దాదాపు 22 వేల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. దిబ్రూఘర్ జిల్లాలో 3,800 మంది, కోక్రాఝర్‌లో దాదాపు 1,800 మంది ప్రభావితమయ్యారు.

వరద బాధితుల కోసం 7 జిల్లాల్లో 25 రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోని దాదాపు 444 గ్రామాలు వరదల బారిన పడగా, దాదాపు 23 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. బిస్వనాథ్, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, కమ్రూప్, కరీంగంజ్, కోక్రాఝర్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరి, శివసాగర్, సోనిత్‌పూర్, సౌత్ సల్మారా, తముల్‌పూర్, ఉదల్‌గురిలలో భారీగా వరదలు సంభవించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు