దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లోనూ వర్షం కురుస్తోంది. ఐతే మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..ఢిల్లీ, ముంబైలో దంచికొడుతున్న వానలు..!!
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబై, గోవాలోనూ రెండు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ముంబై, గోవాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్టల్ ఏరియాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, గోవాతోపాటుగా హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, యూపీ, గుజరాత్ పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.

Translate this News: