విస్తరించిన రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhoomi 24 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతవరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది. కాగా రెండు రోజుల క్రితం ఖమ్మంలోకి ఎంటరైన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటితో తెలంగాణ అంతటా విస్తరిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు షురూ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతోపాటుగా యాద్రాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని...ఇదే వేగాన్ని కొనసాగించినట్లయితే రానున్న మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనతో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని...చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ ఆలర్ట్ కూడా జారీ చేసింది. గతేడాది జూన్ మొదటివారం కల్లా తెలంగాణ అంతటానూ విస్తరించిన రుతుపవనాలు, ఈ రెండువారాల ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతన్నలు సాగుకు రెడీ అవుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి