Pawan kalyan: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్!
గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు.
గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు.
తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నెలకొన్న పరిస్థితులపై నటుడు విశాల్ స్పందించారు. చెన్నై మేయర్, కార్పొరేషన్ కమిషనర్, అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. కనీసం మీ బాధ్యతనైనా నిర్వర్తించి ప్రజలను కాపాడండి అంటూ చురకలంటిచారు.
ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో తీరం దాటుతుందని అధికారులు వివరించారు. సాయంత్రానికి తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు.