/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T181951.176-jpg.webp)
Jammu and Kashmir: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రభుత్వాలు సైతం ప్రజలకు కీలక ప్రకటన జారీ చేస్తున్నాయి. అవసరమైతే తప్పా అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నాయి. ఇదిలావుంటే.. మరోవైపు జమ్మూ-కశ్మీర్‌ను మూడురోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు అవస్థలు పడుతున్నారు.
@Kashmir_Weather#jehlum sopore pic.twitter.com/5i1tf2tGKm
— Aamir Malik (@aamirajaz) April 29, 2024
24 గంటల్లో మరింత పెరిగే అవకాశం..
ఈ విపత్తు కారణంగా ఇప్పటికే జమ్మూ-శ్రీనగర్ హైవే, మొఘల్ రోడ్డుతోపాటు మరికొన్ని రహదారులు మూసివేశారు. NH-44 రహదారిపై ప్రయాణం చేయవద్దని సూచించారు. శ్రీనగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు రాబోయే 24 గంటల్లో మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వరదల కారణంగా జీలం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయని, రాబోయే 24 గంటలపాటు ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు.
Current visuals from Wahipora Langate District Kupwara Jammu and Kashmir... There is a phenomenal rise in the water level of Nallah Pohru, main tributary of Jhelum River @Cloudmetweather@Kashmir_Weather@KashmirForecast@LabeebGulzar@shubhamtorres09@indiametskypic.twitter.com/sX9hu12Ukb
— Aadil Bashir (@imab2035) April 29, 2024