/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
బంగాళాఖాతంలో ఆవర్తన పరివర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే తమిళనాడు, పాండిచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Snacks for tenth graders : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే..
Northeast Monsoon has officially made 🙌 grand entry with good rains being observed along coastal #TamilNadu & south coastal Ap from last night ❗️Next 4-5 days active monsoon conditions will persist across large parts of TN & south coastal #AndhraPradesh 👍#Nellore, #Tirupati,… pic.twitter.com/iNlTRHg5Wk
— Eastcoast Weatherman (@eastcoastrains) October 15, 2025
ముఖ్యంగా ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఒకేసారి రెండు ఆవర్తనాలు.. అప్రమత్తమవుతున్న అధికారులు
తెలంగాణాలో ఈ జిల్లాలో..
తెలంగాణలో హన్మకొండ, వరంగల్, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
#Telanganarains#HyderabadRains#AndhrapradeshRainspic.twitter.com/shOaJG0f1O
— MasRainman (@MasRainman) October 15, 2025