/rtv/media/media_files/2025/06/04/W6RiWug0QQwlc0jqQHuG.jpg)
High Protein Snacks
Snacks for tenth graders : తెలంగాణలోని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ.. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు నుంచే వారికి స్నాక్స్ అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దసరా సెలవుల తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. అందుకే విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయింపుతో పోషక విలువలున్న చిరుతిళ్లను అందించాలని యోచిస్తున్నారు.
Also Read: Bigg Boss Promo: రెచ్చిపోయిన రీతూ.. డెమోన్ పవన్ గప్ చుప్! నామినేషన్స్ లో రచ్చ రచ్చ!
ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపారు. సాధారణంగా గత కొన్ని సంవత్సరాలుగా.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, సంక్రాంతి సెలవుల తర్వాత లేదా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలయ్యే వరకు దాదాపు 35-40 రోజుల పాటు మాత్రమే విద్యార్థులకు ఈ స్నాక్స్ అందించేవారు.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!
అయితే ప్రభుత్వ పాఠశాలల్లో.. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత నుంచే ప్రత్యేక తరగతులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇతర గ్రామాల విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లేసరికి సాయంత్రం 7 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసి, ఇళ్లకు వెళ్లే వరకు ఏమీ తినకపోవడంతో ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన విద్యాశాఖ అధికారులు నవంబరు నుంచే సాయంత్రం స్నాక్స్ అందిస్తే విద్యార్థులు ప్రత్యేక తరగతులకు మరింత ఉత్సాహంగా హాజరవుతారని, ఆరోగ్యంగా ఉంటారని భావించి ఈ కీలక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.ఈ నేపథ్యంలో నవంబరు నుంచే సాయంత్రం స్నాక్స్ అందిస్తే పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని భావించిన విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది.
ఒక్కొక్కరికి రోజుకు రూ.15
ఈ పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,600 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేయాలనేది ప్రతిపాదన.. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే.. విద్యార్థులకు పోషక విలువలు ఉన్న స్నాక్స్ ను అందించనున్నారు. వీటిలో ఉడకబెట్టిన పెసలు, బొబ్బర్లు లేదా శనగలు, పల్లీలు-బెల్లం వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయల పకోడి వంటివి రోజుకు ఒక్కో రకం చొప్పున విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఇది కూడా చూడండి: Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట ప్రారంభం