/rtv/media/media_files/2025/07/19/heavy-rains-2025-07-19-13-36-56.jpg)
Heavy Rains
గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా సూర్యుడు మండుతున్నా.. సాయంత్రం వచ్చేసరికి వాన దేవుడు నగరాన్ని మంచేస్తున్నాడు. నేడు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలకు అత్యవసరం అయితేనే తప్ప లేకపోతే బయటకు రావద్దని అధికారులు తెలిపారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని, చెట్ల కింద ప్రజలు అసలు ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చూడండి: IndiGo flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మృత్యు అంచుల్లో ప్రయాణికులు
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
భారీ వర్షాలు నేడు పడటం వల్ల సిటీలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే నేడు ఐటీ ఉద్యోగులకు సెలవు కావడం వల్ల కాస్త ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వర్షం మొదలవుతుంది. హైదరాబాద్‌తో పాటు శంషాబాద్, చిలుకూరు, సికింద్రాబాద్, ఘట్ కేసర్, కీసర, మేడ్చల్, జిన్నారం, ఇస్నాపూర్, శంకరపల్లి, చేవెళ్లలో మహేశ్వరం, నర్సాపూర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!
మధ్యాహ్నం 4 గంటలకు అబ్దుల్లాపూర్, సికింద్రాబాద్, షామీర్ పేట, మేడ్చల్, తూప్రాన్, నర్సాపూర్, శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5 గంటల సమయంలో అబ్దుల్లాపూర్ మెట్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, కీసర, భువనగిరి, యాదగిరిగుట్ట, షామీర్‌పేట, మేడ్చల్, బొంతపల్లి, తూప్రాన్, నర్సాపూర్, చేగుంటలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. చౌటుప్పల్, ఎల్లంకి, వెలిగొండ, బూదాన్ పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరులో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇలా రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల వారు కాస్త జాగ్రత్తగా ఉండటం బెటర్. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ప్రజలను సూచించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!