/rtv/media/media_files/2025/07/19/shamshabad-airport-2025-07-19-12-51-43.jpg)
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. థాయ్ లాండ్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని మళ్లీ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండింగ్ చేశాడు పైలట్. షెడ్యూల్ ప్రకారం ఉ. 6 గంటలకు థాయ్‌లాండ్ కు ఎయిర్ ఇండియా బోయింగ్-07 ఫ్లైట్ బయలుదేరాల్సి ఉంద. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అత్యవసర ల్యాండింగ్ కు గల కారణాలను అధికారులు ఇంకా వెళ్లడించలేదు.
ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 272 మంది దుర్మరణం పాలయ్యారు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లపై ప్రయాణికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్ ఇండియా తన ఫ్లైట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం చర్చనీయాంశమైంది.