/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t133130760-2025-11-04-13-32-01.jpg)
Heavy rain in these districts in the next few hours
Rain Alert :తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, జనగామలో భారీ వర్షం కురిసింది. కాగా వరంగల్‌లో ఒక్కసారిగా కురిసిన ఈ వర్షం కారణంగా ఏనుమామూల మార్కెట్ లోని పత్తి, మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అటు ఏపీలోని అనంతపురం, నంద్యాలలో మోస్తరు వాన పడుతోంది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/04/71-2025-11-04-13-32-30.webp)
అలాగే రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ రోజు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు41-61 కి.మీ మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపుట, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో భారీ వాన కురుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం భారీ వర్షం పడింది. సుమారు అరగంటపాటు ఈదురు గాలులతో కూడిన వాన కుండపోతగా కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది.
అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం పడింది. వరంగల్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల 'మొంథా' తుపాను ముంపు నుంచి ఇంకా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు పూర్తిగా తేరుకోలేదు. తాజా వర్షంతో మరోసారి కాలనీవాసుల్లో ముంపు భయం నెలకొంది. జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్, లింగాల ఘన్‌పూర్, తరిగొప్పుల, నర్మెట్ల, బచ్చన్నపేట మండలాల్లో వర్షం పడుతోంది.
సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, సోమారం, లస్మన్నపల్లి, ఎక్లాస్పూర్, దుద్దెనపల్లి, రాంచంద్రాపూర్, జాగిరిపల్లి, వెన్కెపల్లి తదితర గ్రామంలో మంగళవారం ఉదయం మబ్బులు కమ్ముకొని చిన్నగా మొదలైన వర్షం భారీగా కురుస్తోంది. దీంతో కళ్ళాల్లో, రోడ్లపై ధాన్యం ఆరబోసిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మొంథా తుపాన్ కారణం భారీగా నష్టపోయిన రైతులు ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే చేతికొచ్చిన పంట నీటి పాలయ్యే పరిస్థితులు ఉన్నాయని రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Follow Us