/rtv/media/media_files/2025/08/09/kakinada-2025-08-09-08-35-53.jpg)
ప్రస్తుతం రోజుల్లో రోజుకొక కొత్తమోసం బయటపడుతోంది. ప్రజలను ఏదో విధంగా మోసం చేయాలనే చూస్తున్నారు. ఇప్పటి వరకు సైబర్ క్రైమ్‌లు ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ క్లీనిక్ ఓ వ్యక్తిని నమ్మించి మోసం చేసిన ఘటన కాకినాడలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సురేష్‌కు జుట్టు లేదు. దీంతో అందరూ హేళన చేసేవారు. జుట్టు సమస్యతో సురేశ్ బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న VRS హెయిర్ క్రియేషన్స్ క్లీనిక్ అతన్ని సంప్రదించింది. తమ దగ్గర అత్యాధునిక చికిత్స ఉందని 98 వేల రూపాయలు ఖర్చు చేస్తే బోడి గుండుపై జుట్టు మొలిపిస్తామని అతన్ని నమ్మించారు.
ఇది కూడా చూడండి: ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!
ట్రీట్‌మెంట్ చేస్తామని డబ్బులు కట్టించుకుని..
డబ్బులు ఖర్చు అయినా జుట్టు వస్తుందని నమ్మిన సురేశ్ చికిత్స కోసం సిద్ధమయ్యాడు. ఈ ట్రీట్‌మెంట్‌కి మొదట 10 వేల రూపాయలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. మిగతా 80 వేలు బజాజ్ ఫైనాన్స్ ద్వారా లోన్‌గా ఇప్పించారు. వారిని నమ్మిన సురేశ్ ప్రతీ నెల ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి వెళ్లేవాడు. దాదాపుగా 9 నెలల పాటు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత చివరికి జుట్టు రాకపోవడంతో పాటు VRS హెయిర్ క్రియేషన్స్ క్లీనిక్ చేసిన మోసం బయటపడింది. VRS హెయిర్ క్రియేషన్స్ క్లీనిక్ దాదాపుగా 9 నెలల పాటు సురేష్‌ను తిప్పించుకుంది. ప్రతీ నెల రకరకాల పరీక్షలు చేయడంతో పాటు మందుల పేరుతో దాదాపు 5 వేల రూపాయల వరకు బిల్లులు వసూలు చేసింది.
సురేష్‌ను ప్రతి నెలా ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటూ, సమయాన్ని వృథా చేసింది. 9 నెలల తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సురేష్ ఆ క్లీనిక్‌ను నిలదీశాడు. అప్పుడు సంస్థ నిర్వాహకులు, సురేష్‌కు బీపీ, షుగర్ ఉన్నాయని అందుకే చికిత్స చేయలేమని చెప్పి కాలయాపన చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన సురేష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇలాంటి మోసపూరిత సంస్థలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజల సమస్యలను క్యాచ్ చేసి మోసం చేస్తున్నారని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. జుట్టు పెంచుతామని నమ్మబలికి అమాయక ప్రజలను మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటి చికిత్సలు తీసుకుంటే ముందుగానే తెలుసుకుని చికిత్స తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చూడండి: Crime News: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్..తల్లి గుట్టు విప్పిన కూతురు