/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
Rain
తెలంగాణలో మరో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలాఉండగా బంగాళఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్టవ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గురువారం మొత్తం ముసురు వాన కురిసింది.
Also Read: వామ్మో.. పడక సుఖం ఇవ్వడం లేదని భర్తను చంపేసిన భార్య
ఏకధాటిగా కురిసిన వర్షంతో గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కువగా కుమురం భీ అసీఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.6 సెం.మీ వర్షం కురిసింది. మొత్తంగా రాష్ట్రంలో 836 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో లోలెవెల్ వంతెనలు మునిగిపోయాయి. మున్నేరులో వరద పోటెత్తింది.
Also Read: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !
ఐఎంపీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఇక ఆదివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల.. అలాగే సోమవారం ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి.