Weather Update: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

New Update
Hyderabad Heavy Rains

Heavy Rains

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీ(AP) లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. భారీ వర్షాలు ఉండటంతో హెచ్చరికల దృష్ట్యా ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, పంట పొలాలు, విద్యుత్ స్తంభాలు, సెల్ ఫోన టవర్ల దగ్గర ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.  ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో అధికారులు బిగ్ అలర్ట్ విధించారు. మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: TG Crime: వనపర్తిలో ఆటోను తొక్కేసిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో!

ఈ ఏరియాల్లో భారీ వర్షాలు..

తెలంగాణ(telangana) లో ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. అనవసరమైన ప్రయాణాలను ఆపుకోవాలని వెల్లడించారు. ఈ జిల్లాలతో పాటు మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, తార్నాక్, కూకట్‌పల్లి, మాధాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్‌గూడ, జూబ్లిహిల్స్, దుర్గం చెరువు, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, పఠాన్‌చెరువు, మెట్టకూడ, మలక్‌పేట్, చార్మినార్, అఫ్జల్ గంజ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. అలాగే వర్షానికి కరెంటు స్తంభాలు, పాతబడిన గొడల దగ్గర ఉండకూడదని అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్త వల్ల అయినా షాక్ కొట్టే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: HYD Crime: మహిళా డాక్టర్ ప్రాణం తీసిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌లో దారుణం!

Advertisment
తాజా కథనాలు