Weather: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..
ఈ మేరకు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏపీలో మరో వారం రోజులు వర్షాలే వర్షాలు అవకాశం ఉందని తెలిపింది. మొదటి రెండు రోజులు 40 -నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
Also Read: America-Gunturu:టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
rains | telangana | andhrapradesh | telugu-news | today telugu news