Viral Video : ఏం మనిషివిరా నువ్వు.. శవం మీదున్న బంగారం ఎత్తుకెళ్లాడు..వీడియో వైరల్!

హిరన్వాడ గ్రామానికి చెందిన 26 ఏళ్ల శ్వేత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఉమ్మడి ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడున్న వార్డుబాయ్ విజయ్...ఎవరూ చూడలేదనుకుని శ్వేత చెవి పోగులను దొంగిలించాడు.

author-image
By Krishna
New Update
Caught on Cam

Caught on Cam

సమాజంలో రోజురోజుకూ మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి అనేందుకు ఇదే ఓ ఉదాహరణ..  హిరన్వాడ గ్రామానికి చెందిన 26 ఏళ్ల వివాహిత శ్వేత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఉమ్మడి ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడున్న వార్డుబాయ్ విజయ్...ఎవరూ చూడలేదనుకుని శ్వేత చెవి పోగులను దొంగిలించాడు.

Also read :  బీజేపీ లీడర్ హత్యకు కుట్ర.. రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన సుపారీ గ్యాంగ్

చెవిపోగులు దొంగతనం చేస్తున్నట్లుగా

మృతదేహాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు, ఆమె బంగారు చెవిపోగులు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భావించి పోలీసులపై అనుమానం వ్యక్తం చేయగా..  సీసీటీవీ ఫుటెజ్ పరిశీలించగా..  ఆ ఫుటేజ్‌లో విజయ్ ఆ మహిళ శరీరం నుండి చెవిపోగులు దొంగతనం చేస్తున్నట్లుగా క్లియర్ గా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Also Read :   8వ తరగతి విద్యార్థి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్‌‌పై గూగుల్ సీఈఓ ప్రశంసలు

 అయితే అప్పటికే నిందితుడు విజయ్ అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి భర్త సచిన్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆదర్శ్ మండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శ్వేత మృతితో ఆమె  కుటుంబం అంతా  విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానకంగా చర్చనీయాంశంగా మారింది.  

Also Read : Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!.

Also read :  లోకల్‌ ట్రైన్‌లో స్టార్ నటికి యువకుడి ముద్దు.. భయంతో ఆమె ఏం చేసిందంటే!

Advertisment
తాజా కథనాలు