Malavika: లోకల్‌ ట్రైన్‌లో స్టార్ నటికి యువకుడి ముద్దు.. భయంతో ఆమె ఏం చేసిందంటే!

నటి మాళవిక మోహన్ ఓ రోజు ముంబై లోకల్ ట్రైన్ లో స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో తనకు ఎదురైనా ఒక సంఘటన గురించి పంచుకుంది. కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు అంటూ తెలిపింది.

New Update
actress Malavika Mohanan

actress Malavika Mohanan

Malavika Mohan: మలయాళ నటి మాళవిక మోహన్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని  పంచుకున్నారు. ''ఒక రోజు రాత్రి ముంబైలో తన స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్ లో వెళ్తున్నాము. ఆ సమయంలో కంపార్ట్మెంట్ లో మేము తప్పా మరెవరూ లేరు. అప్పుడు ఒక వ్యక్తి కంపార్ట్మెంట్ లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. అతడి ప్రవర్తనతో మేమంతా భయపడ్డాం. సుమారు పది నిమిషాల పాటు భయంభయంగా ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ లో మరికొంతమంది ప్రయాణికులు తోడవడంతో.. ఊపిరి పీలుచుకున్నాము'' అని తెలిపింది మాళవిక. 

నాభిపై దృష్టి

అలాగే హీరోయిన్ గా శరీరాకృతి విషయంలో తాను ఎదుర్కున్న సవాళ్ళను వెల్లడించారు. దక్షిణాది చిత్రాలలో నటీమణుల నాభి పట్ల ఉన్న వ్యామోహం గురించి బహిరంగంగా మాట్లాడారు.  సౌత్ సినిమాల్లో నటీమణుల నాభిపై ఎక్కువ దృష్టి పెడతారనేది పెద్ద సత్యమని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె అన్నారు. ఒకానొక సమయంలో సన్నగా ఉన్నానని పలు విమర్శలు వచ్చాయని తెలిపారు. సన్నగా ఉన్నందున అస్థిపంజరం అని కూడా పిలిచారని వాపోయింది. ఈ విమర్శలు తనను మానసికంగా చాలా భాదపెట్టాయని వెల్లడించింది. ఒక వ్యక్తి లేదా అమ్మాయిని శరీరాకృతిపై ట్రోల్ చేయడం వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు.

ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ  భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ సరసన 'రాజాసాబ్' లో నటిస్తోంది. దీంతోపాటు తమిళ్ లో 'సర్దార్ 2', మలయాళంలో 'హృదయపూర్వం' చిత్రాలు చేస్తోంది. 

telugu-news | cinema-news | latest-news | malavika-mohan

Also Read: Samantha: తిరుపతిలోనే సమంత పెళ్లి ముహూర్తం ఫిక్స్.. బాయ్ ఫ్రెండ్ ను తీసుకెళ్లి!

Advertisment
తాజా కథనాలు