Vaibhav Suryavanshi: 8వ తరగతి విద్యార్థి ఆట చూసేందుకే నిద్ర లేచా.. వైభవ్‌‌పై గూగుల్ సీఈఓ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై గూగుల్ సీఈఓ ప్రశంసలు కురిపించారు. ‘‘నేను 8వ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్ర లేచాను. ఐపీఎల్‌లో సూర్యవంశీ అద్భుతమైన అరంగేట్రం. 14 ఏళ్ల కుర్రాడి ఆట చాలా అద్భుతంగా ఉంది’’ అంటూ తెలిపారు.

New Update
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

ఐపీఎల్ 2025 సీజన్ పోరు హోరా హోరీగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ జరుగుతోంది. ఇందులో భాగంగానే నిన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య తగ్గాపోరు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిపాలైంది. 

Also Read: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!

అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినా రాజస్థాన్ రాయల్స్ జట్టులోని యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరు మాత్రం క్రికెట్‌ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. అతి పిన్న వయసులో కేవలం 14 ఏళ్ళకే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెట్‌గా చరిత్ర సృష్టించాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగాడు.  తొలి బంతినే సిక్సుగా మలిచి ప్రశంసలు అందుకున్నాడు. 

Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మొత్తంగా 20 బంతుల్లో 34 పరుగులు చేసి దుమ్ము దులిపేశాడు. అందులో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దీంతో సూర్యవంశీపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సూర్యవంశీపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌ సైతం అభినందనలు చెప్పారు. 

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

కుర్రాడి ఆట అద్భుతంగా ఉంది

సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. తాను 8వ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్ర లేచానని అన్నారు. ఐపీఎల్ ‌లో సూర్యవంశీ అద్భుతమైన అరంగేట్రం అంటూ తెలిపారు. ఈ 14 ఏళ్ల కుర్రాడి ఆట చాలా అద్భుతంగా ఉందని.. తాను అస్సలు ఊహించలేదని ప్రశంసలు కురిపించారు. తొలి బంతిని ఎదుర్కొన్న సూర్యవంశీ బ్యాట్ దూకుడు అద్భుతంగా ఉందని అన్నారు. ఈ మేరకు టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసుకున్నారు. కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్‌ను చూసినట్లు అనిపిస్తోందని అన్నారు. 

vaibhav-suryavanshi | latest-telugu-news | telugu-news | IPL 2025

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు