Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

హైదరాబాద్‌ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్‌ మెట్టులో దారుణం వెలుగుచూసింది. మేనకోడలి బర్త్ డే వేడుకల్లో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త! కేక్‌కటింగ్ జరుగుతుండగా.. కత్తితో భార్య గొంతు కోసి పారిపోయాడు.

New Update

Crime:  ఈ మధ్య సమయంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి బంధానికి విలువ లేకుండా పోతుంది. వివాహేతర సంబంధాలు గొడవలతో  భార్యను భర్త, భర్తను భార్య అత్యంత దారుణంగా హతమార్చుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఒక చోట భార్య..  భర్త నాలుక కొరికిన ఘటన, మరోచోట భార్యను ముక్కలుముక్కలుగా చేసిన ఘటన, ఇంకోచోట భర్తను కారుతో గుద్దించిన భార్య... ఇలా ఒకరినొకరు చంపుకుంటున్న తీరు గుబులు పుట్టిస్తోంది.

Also Read:Hari Hara Veera Mallu: థియేటర్ వద్ద పిడిగుద్దులతో తనుకున్న పవన్ ఫ్యాన్స్! వీడియో వైరల్

తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన వెలుగుచూసింది.  కుటుంబమంతా కలిసి సంతోషంగా జరుపుకుంటున్న బర్త్ వేడుక ఒక్క క్షణంలో రక్తపాతమైంది. భార్యపై కోపంతో రగిలిపోతున్న భర్త  అత్యంత కిరాతకంగా ఆమె పీకకోసి చంపాడు! ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్‌ మెట్టులో జరిగింది. 

Also Read: Nimisha Sajayan: బ్లాక్ అండ్ వైట్‌లో మెరిసిపోతున్న డీఎన్‌ఏ ముద్దుగుమ్మ.. ఒక్క స్మైల్‌తోనే కుర్రాళ్లు ఫ్లాట్!

గొంతుకోసి చంపి.. 

వివరాల్లోకి వెళితే .. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్- సమ్మక్క దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవలే మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో సమ్మక్క ఇంటి నుంచి వెళ్ళిపోయి.. హైదరాబాద్ లోని  అబ్దుల్లాపూర్ మెట్టులో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. నిన్న ఆమె మేనకోడలి బర్త్ డే ఉండడంతో.. ఆ వేడుకల్లో పాల్గొంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. భార్యపై కోపంతో రగిలిపోతున్న భర్త శ్రీనివాస్ కేక్‌కటింగ్ జరుగుతుండగా.. హఠాత్తుగా అక్కడి వచ్చి ఆమె గొంతు కోసి పారిపోయాడు. శ్రీనివాస్ భార్యను  హత్యచేసేందుకు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు అక్కడి స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 

Also Read: pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి..  పవన్ సంచలన స్టేట్మెంట్!

Advertisment
తాజా కథనాలు