/rtv/media/media_files/2025/07/25/varun-tej-2025-07-25-11-42-38.jpg)
varun tej
Varun Tej: మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ తన పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేస్తున్న ఫోటోని పంచుకుంది. మై రియల్ బంగారం.. ఏ బేబీ బ్లాంకెట్ కొనాలా అని ఆలోచిస్తున్నాడు అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది లావణ్య. ఇందులో వరుణ్ తన పుట్టబోయే బిడ్డ కోసం బ్లాంకెట్ కొంటూ.. ఏది మంచిది? ఏది బాగుంటుంది? అని ఆలోచిస్తూ దుప్పట్లని జాగ్రత్తగా చూస్తున్నారు. తండ్రిగా వరుణ్ పడుతున్న ఈ అందమైన తికమక అభిమానులను, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
బేబీమూన్..
షూటింగ్స్ మధ్యలో కూడావరుణ్ తన సమయాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా భార్యతో టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవ్స్ లో తమ "బేబీమూన్"ను ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే అక్కడికి సంబంధించిన నుంచి కొన్ని అందమైన ఫోటోలు, వీడియోలను కూడా పంచుకున్నారు. బీచ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఆస్వాదిస్తూ నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు. క్యాండిల్‌లైట్ డిన్నర్ తో తమ ప్రేమను పంచుకుంటున్నారు.
VT15..
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. తన రాబోయే చిత్రం VT15 మ్యూజిక్ సిట్టింగ్స్‌లోబిజీగా ఉన్నారు. ఇండో- అమెరికన్ హారర్ కామెడీ నేసథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. VT15 షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్, అనంతపురంలలో రెండు షెడ్యూల్స్ పూర్తి పూర్తి చేయగా.. ప్రస్తుతం కొరియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.