OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

భారత ప్రభుత్వం అభ్యంతరకరమైన,  అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కఠిన చర్యలు చేపట్టింది. కంటెంట్ నియమాలను ఉల్లంఘించి, పోర్నోగ్రఫీ,  అభ్యంతరకరమైన వయోజన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ యాప్స్ పై నిషేధం విధించింది.

New Update
adult content otts banned

adult content otts banned

OTT: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విచ్చలవిడిడా అందుబాటులో ఉంటున్న అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటెంట్ నియమాలను ఉల్లంఘించి అభ్యంతర కంటెంట్ ని ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ యాప్స్ పై ఉక్కుపాదం మోపింది. ఉల్లు (Ullu), ఆల్ట్ (Altt), దేశీఫ్లిక్స్ (DesiFlix), బిగ్ షాట్స్ సహా పలు వెబ్ సైట్లపై నిషేధం విధించింది. ఈ విషయంపై  ప్రభుత్వానికి  అందిన వివిధ దర్యాప్తు సంస్థల సమాచారం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రసారా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ.. ‘ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్‌, దేశీఫ్లిక్స్‌, గులాబ్‌ యాప్‌ వంటివి కంటెంట్ నిబంధనలు ఉల్లంఘించి పలుమార్లు తమ సైట్లలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేసినట్లుగా గుర్తించాం! అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. 

ఈ 24 యాప్స్, వెబ్ సైట్స్ కి సంబంధించిన లింకులను పూర్తిగా కన్పించకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPs)కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  నిషేధించబడిన ఈ 25 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, వాటికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్‌లు ఇకపై భారతదేశంలో పనిచేయవు. వాటి కంటెంట్‌ను ఎవరూ చూడలేరు. 

భారతీయ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించే కంటెంట్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే ఓటీటీ యాప్స్, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్ విషయంలో  బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. 

నిషేధించబడిన యాప్స్ ఇవే 

ఉల్లు (Ullu), ఆల్ట్ (Altt), దేశీఫ్లిక్స్ (DesiFlix), బిగ్ షాట్స్ (Big Shots),  షోఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్‌ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జాల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో ఉన్నాయి. 

Also Read: Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!

Advertisment
తాజా కథనాలు