Anushka Ghaati: ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!

అనుష్క శెట్టి  'ఘాటీ' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అనుష్క అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

New Update

Anushka Ghaati: అనుష్క శెట్టి - విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న 'ఘాటీ' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను జులై 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా, ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ మేరకు చిత్రబృందం ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.  'ఘాటీ' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది ఒక ప్రతిధ్వని.. ఒక అడవి గాలి.. మట్టి నుంచి పుట్టిన కథ! ఈ నిరీక్షణ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతుని అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ ప్రయాణంలో మీరు మాపై చూపుతున్న ప్రేమ, అభిమానులకు  ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టారు. దీంతో అనుష్క అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. 

VFX ఆలస్యం 

అయితే మూవీ ఆలస్యానికి  విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇంకా పూర్తి కాకపోవడమే కారణమని సమాచారం. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్  అందించడానికి, అన్ని పనులు పూర్తయ్యే వరకు విడుదల చేయకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. 'వేదం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత  అనుష్క - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రాన్ని  యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జగర్లమూడి  నిర్మిస్తున్నారు.  రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

అక్రమ గంజాయి వ్యాపారంలో ఒక బాధితురాలి నుంచి క్రిమినల్ మాస్టర్‌మైండ్‌గా మారే ఒక మహిళ కథగా "ఘాటి" రూపొందుతోంది.  ఇందులో అనుష్క ఒక గిరిజన మహిళగా, శక్తివంతమైన పాత్రలోకనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఘాటీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read:Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు