India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉగ్రకుట్న భగ్నమయ్యింది. అమృత్‌సర్‌ దగ్గర్లోని బీఎస్‌ఎఫ్, పంజాబ్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి.

New Update
Terror plot foiled on india-pak border,

Terror plot foiled on india-pak border,

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిహద్దుల్లో ఉగ్రకుట్న భగ్నమయ్యింది. అమృత్‌సర్‌ దగ్గర్లోని బీఎస్‌ఎఫ్, పంజాబ్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తుపాకులు, గ్రనేడ్లు సైతం ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దుల్లో ఇలా ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. 

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

బీఎస్‌ఎఫ్ ఇంటెలిజెన్స్‌ వింగ్ సమాచారం ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 30న సాయంత్రం ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా భద్రతా బలగాలు ఆయుధాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. అయితే దీనిపై తదుపరి విచారణ  చేయనున్నారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, పంజాబ్‌ పోలీసులు వెంటనే స్పందించడంతో ఈ ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. 

Also Read: పిల్లలకు మాతృభాషలోనే పేర్లు.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొంచిందిన స్టాలిన్ ప్రభుత్వం!

ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా పాకిస్థాన్ ఐఎస్‌ఐ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇటీవల మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లా-పాక్ మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. దీంతో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్‌లోని భారత్‌ సరిహద్దుల వైపు రావడం పెరిగిపోయింది. దీంతో బంగ్లాదేశ్‌-భారత్ ర్యాడికల్ గ్రూపులను పాక్‌ వాడుకునే ఛాన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 

Also Read: పిల్లలకు మాతృభాషలోనే పేర్లు.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొంచిందిన స్టాలిన్ ప్రభుత్వం!

Also Read: భారత జవాన్‌ విడుదలను సాగదీస్తున్న పాక్.. ఆదేశాలు రాలేదంటూ నాటకాలు!

india-pakistan war tension | india-pakistan | rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు