Visakhapatnam: విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది.. ఓ వ్యక్తి పళ్ల సెట్ నిద్రలో ఊడిపోగా మింగేశాడు.. అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వైజాగ్ కి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్ల క్రితం పళ్ళ సెట్టు పెట్టించుకున్నాడు. అయితే, ఆయన నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయింది. ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇరుక్కుంది.
Also Read: Uthappa: మాజీ క్రికెటర్ ఉతప్పకు భారీ షాక్..అరెస్ట్ వారెంట్ జారీ
పొట్టలోకి పళ్ళ సెట్టు
అయితే లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో వెంటనే కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ఎక్స్ రే, సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది.
Also Read: CBN: జగన్ కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా?
వెంటనే ఆ వ్యక్తికి జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరంతో చాలా జాగ్రత్తగా పళ్ళ సెట్టును బయటకు తీశారు. టైం బాగుండి నోటివరకు వచ్చిన తర్వాత ఒక చిన్న గాయం అయ్యింది అంతే తప్ప మరేమి కాలేదు, డాక్టర్లు వెంటనే సరిచేయడంతో తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
Also Read: Ap School Holidays: ఏపీలో భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవులు
జాగ్రత్తగా తీయకపోతే ఊపరితిత్తులకు, శ్వాస నాళాలకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది అని వైద్య నిపుణులు తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం అని హెచ్చరిస్తున్నారు.
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు